‘జానకి కలగనలేదు’ పాట కూడా ఆలాగే
ABN , First Publish Date - 2021-03-19T22:34:32+05:30 IST
మంచి సాహిత్యానికి మంచి సంగీతం తోడైతే మంచి గీతం అవుతుంది. భార్యాభర్తల కథ కూడా అలాంటిదే. "జానకి కలగనలేదు" పాట కూడా

మంచి సాహిత్యానికి మంచి సంగీతం తోడైతే మంచి గీతం అవుతుంది. భార్యాభర్తల కథ కూడా అలాంటిదే. "జానకి కలగనలేదు" పాట కూడా ఆలాగే ప్రతి హృదయాన్నీ చేరుకోడానికి అదే ప్రధాన కారణం. గతంలో ఒక సినిమాలో వచ్చిన ఆ పాటలో చరణం వరకు ఉంచి, చరణాలను కథను బట్టి మర్చి కొత్త ప్రేక్షకులకు అందించింది స్టార్ మా.
‘జానకి కలగనలేదు’ సీరియల్ కథలో హీరో, హీరోయిన్‌ల అనుబంధం ఈ పాటలో తెలుస్తుంది. అందమైన సాహిత్యంలో ప్రతి పదంలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ స్పష్టం అవుతుంది. ‘ఆ కలలకు రంగులు తొడిగే శ్రీవారే మావారయే’ అని కవి రాసిన వాక్యంలోనే కథ అంతా వుంది. ‘‘నీ అక్షర యాగానికి నే చమురై తోడే వుంటా’’ అని ఆ భర్త ప్రేమగా హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవడమే కథ అంతా. ఇంకా రెండు కుటుంబాలు, ఆ మనుషులు, ఆ మనస్తత్వాలు అన్నీ కలిస్తే ‘జానకి కలగనలేదు’ సీరియల్.
ఈ నెల 22న (సోమవారం) ఈ సీరియల్ ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది.
‘జానకి కలగనలేదు’ పాట కోసం ఇక్కడ క్లి