శ్రీశ్రీ సమున్నత శిఖరం

ABN , First Publish Date - 2021-09-20T12:53:24+05:30 IST

పవన్‌కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ సెట్‌లో ఉంటే చాలు వారిమధ్య సాహితీ చర్చలు ఓ ప్రవాహంలా సాగిపోతుంటాయి. అలాగే శుక్రవారం సాయంత్రం ‘భీమ్లా నాయక్‌’ సెట్‌లో మహాకవి శ్రీశ్రీ గొప్పతనం గురించి, ఆయన రచనా వైశిష్ట్యం గురించి వీరిద్దరు మాట్లాడుకున్నారు...

శ్రీశ్రీ సమున్నత శిఖరం

పవన్‌కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ సెట్‌లో ఉంటే చాలు వారిమధ్య సాహితీ చర్చలు ఓ ప్రవాహంలా సాగిపోతుంటాయి. అలాగే శుక్రవారం సాయంత్రం ‘భీమ్లా నాయక్‌’ సెట్‌లో మహాకవి శ్రీశ్రీ గొప్పతనం గురించి, ఆయన రచనా వైశిష్ట్యం గురించి వీరిద్దరు మాట్లాడుకున్నారు. శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న ‘మహాప్రస్థానం’ ప్రత్యేక స్మరణికను పవన్‌కల్యాణ్‌ త్రివిక్రమ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘ఓ కవి తాలుకు ప్రయాణం అంటే ఒక జాతి తాలుకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు, రాసిన ఓ పుస్తకం గురించి  ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటారు. శ్రీశ్రీ తెలుగువాళ్లు గర్వించదగ్గ కవి. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు. తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ఆయన పుస్తకం చూడడం నిజంగా గొప్ప విషయం. ఆయన అత్మ ఎక్కడున్నా స్వతంత్రం అనేసరికి అక్కడికి వచ్చి ఆగుతుంది’ అన్నారు. ‘ఒక కవి గురించి మరో కవి చెబితే వచ్చే సొబగు ఇది’ అని పవన్‌కల్యాణ్‌ ప్రశంసించారు. వెంటనే త్రివిక్రమ్‌ స్పందిస్తూ ‘శ్రీశ్రీ అంటే ఒక సమున్నత శిఖరం. మనందరం ఆ శిఖరం దగ్గరి గులకరాళ్లం’ అన్నారు

Updated Date - 2021-09-20T12:53:24+05:30 IST