‘దృశ్యం 2’లో భాగం కానందుకు బాధగా ఉంది: ‘దృశ్యం’ దర్శకురాలు శ్రీ ప్రియ
ABN , First Publish Date - 2021-11-16T21:47:25+05:30 IST
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా.. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దృశ్యం 2’. ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్

విక్టరీ వెంకటేష్, మీనా జంటగా.. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దృశ్యం 2’. ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ‘దృశ్యం’ చిత్ర దర్శకురాలు శ్రీ ప్రియ కూడా పాల్గొన్నారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘దృశ్యం 1 రిలీజ్ అయిన తర్వాత.. దీనికి సీక్వెల్ చేయమని నేను జీతూను అడిగాను.. కానీ జీతూ తిరస్కరించాడు. తాను న్యాయం చేయలేనని చెప్పాడు. ఇప్పుడు సీక్వెల్ తీయడం.. తెలుగులో కూడా జీతూ డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. పార్ట్ 2లో భాగం కానందుకు ఫీలింగ్ ఏమిటని చాలా మంది నన్ను అడిగారు. నేను ఒక్కటే చెప్పగలను.. ‘చాలా బాధగా ఉంది’. ఇదే వేదికగా జీతూని అడుగుతున్నాను.. దృశ్యం 3,4,5.. కూడా చేయాలని కోరుకుంటున్నాను. వాస్తవానికి పార్ట్-2లో నేను కూడా ఉండేలా చూడాలని జీతూ అనుకున్నాడు. కానీ కరోనా వల్ల కుదరలేదు. రాంబాబు క్యారెక్టర్‌కు వెంకటేష్‌కు మించి ఎవరూ సూట్ అవ్వరు’’ అని అన్నారు.