ఇద్దరు మిత్రుల కథలో ఓ అగ్రహీరో
ABN, First Publish Date - 2021-03-19T03:21:35+05:30
ఇద్దరు స్నేహితుల జీవితాల్లో జరిగిన యధార్థ సంఘటలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ అగ్రహీరోను నటింపజేసేందుకు
కోలీవుడ్: శ్రీ కందస్వామి మూవీ మేకర్స్ పతాకంపై కళత్తూరు కె. నీలకంఠన్ సమర్పణలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ‘కరుప్పుఆడు’ అనే చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు విజయ్ మోహన్ తెరకెక్కించనున్న రెండో చిత్రం ఇది. ఈ చిత్రానికి మలర్ నీలకంఠన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1990వ దశకంలో ఇద్దరు స్నేహితుల జీవితాల్లో జరిగిన యధార్థ సంఘటలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ అగ్రహీరోను నటింపజేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని, మరో హీరోగా మణి అనే యువకుడిని పరిచయం చేస్తున్నట్టు దర్శకుడు విజయ్ మోహన్ తెలిపారు. హీరోయిన్‌గా అక్షితతో పాటు మరో కొత్త యవతిని పరిచయం చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే, ఓ కీలక పాత్రను పాల్ రాజ్ రాధాకృష్ణన్ పోషిస్తుండగా, ఇతర పాత్రల్లో అరియాన్, ‘యానై’ చిత్రం నటుడు ప్రభాదిస్ శ్యామ్స్ తదితరులు నటిస్తున్నట్టు చెప్పారు. యు.రెనాల్డ్ రీగన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ నెలాఖరులో షూటింగును ప్రారంభిస్తామని దర్శకుడు వెల్లడించారు.