న‌టి కావాల‌నుకున్న జ‌యంతికి ఎన్టీఆర్ ఇచ్చిన స‌ల‌హా ఏంటి?

ABN , First Publish Date - 2021-07-26T18:01:53+05:30 IST

ఐదు వంద‌ల‌కు పైగా ప‌లు భాషా చిత్రాల్లో న‌టిగా మెప్పించిన న‌టి జ‌యంతి నిన్న రాత్రి క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆమెకు చిన్న‌ప్ప‌టి నుంచే సినీ రంగంతో అనుబంధం ఉంది. ఆమె సినిమాల్లోకి రావాల‌నుకున్న‌ప్పుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఓ స‌ల‌హానిచ్చారు.

న‌టి కావాల‌నుకున్న జ‌యంతికి ఎన్టీఆర్ ఇచ్చిన స‌ల‌హా ఏంటి?

ఐదు వంద‌ల‌కు పైగా ప‌లు భాషా చిత్రాల్లో న‌టిగా మెప్పించిన  న‌టి జ‌యంతి నిన్న రాత్రి క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆమెకు చిన్న‌ప్ప‌టి నుంచే సినీ రంగంతో అనుబంధం ఉంది. ఆమె సినిమాల్లోకి రావాల‌నుకున్న‌ప్పుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఓ స‌ల‌హానిచ్చారు. ఇంత‌కీ ఆయ‌నిచ్చిన స‌ల‌హా ఏంట‌నే విష‌యంలోకి వెళితే.. జ‌యంతికి పన్నెండేళ్ల వయసులో కుటుంబం బళ్ళారి నుంచి చెన్నై వ‌చ్చింది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్, జయంతి పక్క పక్క ఇళ్లలో ఉండేవారు. తీరిక సమయాల్లో ఆయన జయంతిని  ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతుండేవారు. 


జయంతి తల్లి సంతాన లక్ష్మి తన కూతుర్ని సినిమాల్లో చేర్చుకోవాలనే కోరిక వ్యక్తం చేసినప్పుడు ముందు చదువు పూర్తి చేయనివ్వమని, బాగా చదువు కొంటున్న అమ్మాయిని సినిమాలు, డాన్సులు అంటూ పక్కదారి పట్టించవద్దని ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. 1963 లో కన్నడ సినిమా ‘జైను గూడు’ చిత్రంతో జయంతి నటిగా పరిచయం అయ్యారు. ఆమె తొలి తెలుగు చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘జగదేక వీరుని కథ’. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి చాలా చిత్రాల్లో నటించారు. వాటిల్లో ‘కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలు’ తనకు బాగా నచ్చాయని జయంతి పలు సందర్భాల్లో చెప్పారు. 

Updated Date - 2021-07-26T18:01:53+05:30 IST