ఆగస్ట్ 6న ‘SR కళ్యాణమండంపం’
ABN , First Publish Date - 2021-07-13T21:22:19+05:30 IST
'రాజావారు రాణిగారు' ఫేమ్ కిరణ్ అబ్బవరం, 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగా ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'SR కళ్యాణమండంపం'. ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
'రాజావారు రాణిగారు' ఫేమ్ కిరణ్ అబ్బవరం, 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగా ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'SR కళ్యాణమండంపం'. శ్రీధర్ గాదె దర్శకుడు. ప్రమోద్, రాజు నిర్మాతలు. ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కింద శంకర్ పిక్చర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం కిరణ్ అబ్బవరం అందించడం విశేషం. విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని దర్శకుడు శ్రీధర్ గాదె తెలిపారు. ఈ సినిమాను ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.