థియేటర్లలోనే.. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’
ABN, First Publish Date - 2021-05-29T01:52:12+05:30
‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా.., ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా.. ఎలైట్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రమోద్ - రాజు నిర్మాతలుగా, నూతన దర్శకుడు శ్రీధర్ గాదే తెరకెక్కించిన చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండంపం ఈఎస్టీ 1975’. ప్రస్తుత పరిస్థితుల
‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా.., ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా.. ఎలైట్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రమోద్ - రాజు నిర్మాతలుగా, నూతన దర్శకుడు శ్రీధర్ గాదే తెరకెక్కించిన చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండంపం ఈఎస్టీ 1975’. ప్రస్తుత పరిస్థితుల రీత్యా అనేక సినిమాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలవుతున్న నేపత్యంలో.. ఈ చిత్రాన్ని మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు ప్రమోద్ - రాజు అధికారికంగా మీడియాకు తెలియజేశారు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ని సైతం హీరో కిరణ్ అబ్బవరం అందించడం విశేషం.
విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు శ్రీధర్ గాదే తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడి, థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటే అప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన చుక్కల చున్ని, చూసాలే కళ్లారా వంటి పాటలు మంచి స్పందనను రాబట్టుకున్నాయని, సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ తెలుపుతున్నారు.