సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'సన్నాఫ్ ఇండియా' టీజర్ వదిలిన సూర్య

ABN, First Publish Date - 2021-06-04T19:02:48+05:30

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సన్నాఫ్ ఇండియా'. తాజాగా చిత్ర టీజర్‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విడుదల చేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సన్నాఫ్ ఇండియా'. తాజాగా చిత్ర టీజర్‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విడుదల చేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజా టీజర్‌కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 'మన అంచహనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను...తన రూటే సపరేటు. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఎప్పుడు ఎలాంటి థాట్‌ను ట్రిగ్గర్ చేస్తుందో ఏ బ్రెయిన్ స్పెషలిస్టు చెప్పలేడు'..అని మెగాస్టార్ ఇచ్చిన ఇంట్రో వాయిస్ మోహన్ బాబును బాగా ఎలివేట్ చేసింది. "నేను చీకటిలో ఉండే వులుతురుని.. వెలుతురులో ఉండే చీకటిని..నేను కసక్ అంటే మీరందరు ఫసక్" అని మోహన్ బాబు చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్‌తో టీజర్ అదిరిపోయింది. ఈ టీజర్‌ను బట్టి చూస్తే మరోసారి గొప్ప క్యారెక్టర్ తో మోహన్ బాబు మన ముందుకు రాబోతున్నట్టు అర్థమవుతోంది. మొత్తానికి 'సన్నాఫ్ ఇండియా' టీజర్ సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది. 



Updated Date - 2021-06-04T19:02:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!