సాఫ్ట్‌వేర్ ప్రేమకథ!
ABN , First Publish Date - 2021-09-22T06:22:58+05:30 IST
సంజయ్ రావు, అనితా షిండే జంటగా జై దర్శకత్వంలో వెంకటరత్నం నిర్మిస్తున్న ‘ప్రేమిస్తే ఇంతే’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘‘ఇందులో చక్కటి ప్రేమకథతో పాటు...
సంజయ్ రావు, అనితా షిండే జంటగా జై దర్శకత్వంలో వెంకటరత్నం నిర్మిస్తున్న ‘ప్రేమిస్తే ఇంతే’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘‘ఇందులో చక్కటి ప్రేమకథతో పాటు కడుపుబ్బా నవ్వుకునే వినోదం ఉంటుంది. సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న హైఫై రొమాంటిక్ చిత్రమిది. సంజయ్ రావు లవర్‌బాయ్‌గా కనిపిస్తారు’’ అని దర్శకుడు జై చెప్పారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తామని నిర్మాత తెలిపారు. ఆలీ, ఆర్జే హేమంత్, ఆర్జే కృష్ణ, వెంకట కిరణ్, ‘వైవా’ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జె. భానుప్రసాద్ సంగీత దర్శకుడు.