సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సిరివెన్నెల కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు!

ABN, First Publish Date - 2021-12-02T23:13:38+05:30

సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త తెలుసుకుని దిగ్ర్భాంతికి లోనయ్యారు. ట్విట్టర్‌ వేదికగా సిరివెన్నెల కవిత్వ పటిమను కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త తెలుసుకుని దిగ్ర్భాంతికి లోనయ్యారు. ట్విట్టర్‌ వేదికగా సిరివెన్నెల కవిత్వ పటిమను కొనియాడారు. ఈ మేరకు సిరివెన్నెల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్‌ చేశారు. కష్టకాలంలో ఆస్పత్రి బిల్లు చెల్లించి ఆదుకున్న ఏపీ సీయంకు, సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిరివెన్నెల కుటుంబ సభ్యులు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నాన్నగారి పట్ల చూపిన గౌరవ మర్యాదలకు, పలికిన మాటలకు రుణపడి ఉంటాం’’ అని సిరివెన్నెల పెద్ద కుమారుడు యోగీశ్వరశర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.  





Updated Date - 2021-12-02T23:13:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!