నేడే సింగర్ సునీత పెళ్లి.. పెళ్లి వేదిక గురించి అప్‌డేట్
ABN , First Publish Date - 2021-01-10T00:19:31+05:30 IST
సింగర్ సునీత, డిజిటల్ మీడియా అధినేత మ్యాంగో రామ్ వీరపనేని పెళ్లి శనివారం జరుగుతుంది.

సింగర్ సునీత, డిజిటల్ మీడియా అధినేత మ్యాంగో రామ్ వీరపనేని పెళ్లి శనివారం జరుగుతుంది. హైదరాబాద్‌లోని ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న శ్రీరామచంద్రుని ఆలయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే తమ స్నేహితులకు, సన్నిహితులకు, సినీ ఇండస్ట్రీలో తమకు దగ్గరైన వారికి వీరు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. అతి కొద్ది మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతారని సమాచారం. పెళ్లి తర్వాత సునీత్, రామ్ కొత్త ఇంటికి వెళతారట.సునీత ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలే సునీతకు దగ్గరుండి పెళ్లి చేస్తుండటం విశేషం.