సిద్ధా వచ్చేశాడు

ABN , First Publish Date - 2021-01-18T10:36:13+05:30 IST

రామ్‌చరణ్‌కు ‘ఆచార్య’ బృందం స్వాగతం పలికింది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన ప్రత్యేక ప్రధాన పాత్రలో కనిపించనున్న...

సిద్ధా వచ్చేశాడు

రామ్‌చరణ్‌కు ‘ఆచార్య’ బృందం స్వాగతం పలికింది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన ప్రత్యేక ప్రధాన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. చరణ్‌ పాత్ర పేరు సిద్ధ అనీ... ఆదివారం నుంచి చిత్రీకరణలో పాల్గొంటున్నారనీ చిత్రనిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలియజేశాయి. ‘‘మా ‘సిద్ధ’ సర్వం సిద్ధం’’ అని దర్శకుడు కొరటాల శివ పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన టెంపుల్‌ టౌన్‌ సెట్స్‌లో చరణ్‌ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ సందర్భంగా ప్రీ-లుక్‌ విడుదల చేశారు.


Updated Date - 2021-01-18T10:36:13+05:30 IST