సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘శ్యామ్ సింగ రాయ్’: విడుదల తేదీ ఖరారు

ABN, First Publish Date - 2021-10-18T18:30:37+05:30

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాష్టియన్ హరోయిన్స్. నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. కోల్ కత్త బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నానీకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఇక ఇటీవల 'టక్ జగదీష్' మూవీతో వచ్చిన నాని.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. 



Updated Date - 2021-10-18T18:30:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!