రీ ఎంట్రీలో రెండు హిట్స్‌ కొట్టిన బ్యూటీ.. ఎవరంటే?

ABN , First Publish Date - 2021-01-19T03:00:54+05:30 IST

టాలీవుడ్‌లో ఒక్కసారి ఐరెన్ లెగ్ అనిపించుకున్నాక.. తిరిగి మళ్లీ ఆ పేరును తొలగించుకోవడం ఎంత కష్టమో తెలియంది కాదు. ఇప్పటికీ కొందరు

రీ ఎంట్రీలో రెండు హిట్స్‌ కొట్టిన బ్యూటీ.. ఎవరంటే?

టాలీవుడ్‌లో ఒక్కసారి ఐరెన్ లెగ్ అనిపించుకున్నాక.. తిరిగి మళ్లీ ఆ పేరును తొలగించుకోవడం ఎంత కష్టమో తెలియంది కాదు. ఇప్పటికీ కొందరు బ్యూటీలు ఆ పేరు నుంచి బయటికి రాలేక.. ఇండస్ట్రీనే వదిలేసిన వారు ఉన్నారు. కానీ ఓ బ్యూటీ మాత్రం ఆ పేరును తొలగించుకోవడమే కాదు.. ఇప్పుడు  గోల్డెన్ హ్యాండ్‌గా మారడం విశేషం. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? 'గబ్బర్‌సింగ్‌' చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టి.. ఐరెన్‌ లెగ్‌ ముద్రను చెరిపేసుకున్న శృతిహాసన్‌. ఈ భామ ఈ ఇయర్ రెండు సినిమాలతో హిట్ కొట్టి.. తను ఇప్పుడు వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. శృతిహాసన్.. మూడేళ్ల క్రితం 'కాటమరాయుడు' సినిమాలో కనిపించి కనువిందు చేసింది. ఆ తర్వాత లవ్ లో కేవ్వుమంటు కెరీర్ ని నాశనం చేసుకుంది. ఇక టాలీవుడ్ లో ఈ బ్యూటీ కెరీర్ కంచికి చేరింది అనుకుంటున్న టైమ్‌లో రవితేజ సరసన 'క్రాక్' సినిమాలో నటించి మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. దానికి తగ్గట్టే ఈ ఏడాది శృతికి బాగా కలిసోచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు 'క్రాక్' హిట్ తో పాటు బాలీవుడ్ లో 'ది పవర్' కూడా సంక్రాంతి సందర్బంగా జీప్లెక్స్ ఓటిటిలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. దీంతో శృతి మళ్లి స్పీడ్ పెంచుతోంది.


రవితేజ 'క్రాక్'  సినిమా లైన్ లో ఉన్నప్పుడే పలు ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట శృతిహాసన్.ఇప్పటికే కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి సరసన 'లాభం' సినిమాలో నటిస్తోంది. తెలుగులో పవన్ సరసన 'వకీల్ సాబ్'  సినిమాలో మెరవనుంది. ఇక బాలీవుడ్ లో ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఆమె గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందట. ఐదేళ్ల క్రితం రవి సుబ్రహ్మణ్యం రాసిన పాపులర్ నవల 'ద బెస్ట్ సెల్లర్ షి రోట్' ఆధారంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కనుంది. ఇందులో నవలా రచయితగా మిధున్ చక్రవర్తి నటిస్తుండగా.. అతని ప్రేయసిగా శ్రుతిహాసన్ నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కోసం ఈ వెబ్ సీరీస్ ను సిద్ధార్థ్ పి మల్హోత్రా నిర్మిస్తున్నారు. ముకుల్ అభ్యంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీరీస్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. మొత్తానికి 'క్రాక్' తో బౌన్స్ బ్యాక్ అయిన శృతిహాసన్ ఇప్పుడు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది.

Updated Date - 2021-01-19T03:00:54+05:30 IST