స్క్రిప్ట్ రాస్తున్న శృతి హాసన్..మరి డైరెక్షన్..?
ABN, First Publish Date - 2021-03-19T18:39:11+05:30
మల్టీ టాలెంట్ అన్నది అదృష్టం అని చెప్పాలి. ఒకరు ఒక పని చేసే సరికే కొన్ని సందర్భాలలో తల ప్రాణం తోకకొస్తుంది. అలాంటిది ఒకేసారీ రెండు మూడు పనులంటే నా వల్ల కాదు.. నాకు ఇదే చేయడానికే సమయం సరిపోవడం లేదని సర్దుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికొస్తే నిర్మాత డబ్బు పెట్టగలడు.. దర్శకుడు సినిమా తీయగలడు.
మల్టీ టాలెంట్ అన్నది అదృష్టం అని చెప్పాలి. ఒకరు ఒక పని చేసే సరికే కొన్ని సందర్భాలలో తల ప్రాణం తోకకొస్తుంది. అలాంటిది ఒకేసారీ రెండు మూడు పనులంటే నా వల్ల కాదు.. నాకు ఇదే చేయడానికే సమయం సరిపోవడం లేదని సర్దుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికొస్తే నిర్మాత డబ్బు పెట్టగలడు.. దర్శకుడు సినిమా తీయగలడు.. నటీ నటులు సహా ఇతర టెక్నీషియన్స్ అందరు తమ తమ పని చేయడానికి సమయం సరిపోదు. చాలా తక్కుమందే తమ సినిమాలకి స్క్రిప్ట్ రాసుకొని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనూ సహాయకులను పెట్టుకుంటున్నారు. అయితే స్టార్ హీరోయిన్‌గా ప్రస్తుతం మంచి ఫాంలో ఉండి కూడా మరొక పని మీద దృష్టిపెట్టబోతుందట శృతి హాసన్.
శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ మాదిరిగా మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. తను మంచి హీరోయిన్ మాత్రమే కాదు సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, రైటర్.. ఇలా పలు విభాగాలలో సత్తా చాటగలదు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న శృతి హాసన్ మూడేళ్ళ క్రితం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ రీసెంట్‌గా క్రాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సాలీడ్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సస్ తర్వాత శృతి హాసన్ వరసగా భారీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశాలు అందుకుంటోంది.
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా సలార్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియీన్ రేంజ్‌లో నిర్మిస్తుండగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్‌తో నటించిన వకీల్ సాబ్ సినిమా వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే తమిళ సినిమా కూడా చేతిలో ఉంది. ఇంత బిజీగా ఉన్న శృతి.. స్క్రిప్ట్ రాయడానికి రెడీ అవుతోందట. ఇప్పటికే తను రాసిపెట్టుకున్న లైన్స్‌ని బౌండెడ్ స్క్రిప్ట్‌గా మార్చబోతున్నట్టు చెబుతోంది. అయితే శృతి హాసన్ రెడీ చేసుకుంటున్న స్క్రిప్ట్‌కి తనే డైరెక్టర్ అవుతుందా లేక వేరే వాళ్ళ చేతిలో పెడుతుందా అన్నది తెలియాల్సి ఉంది.