శ్రుతి... 85 శాతం పూర్తి!

ABN , First Publish Date - 2021-10-18T09:40:53+05:30 IST

తన జీవితంలో ఒక వ్యక్తి వల్ల ఎదురైన సంఘర్షణను శ్రుతి అనే యువతి ఎలా అధిగమించిందనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. హన్సిక టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు...

శ్రుతి... 85 శాతం పూర్తి!

తన జీవితంలో ఒక వ్యక్తి వల్ల ఎదురైన సంఘర్షణను శ్రుతి అనే యువతి ఎలా అధిగమించిందనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. హన్సిక టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. బూరుగు రమ్య ప్రభాకర్‌ నిర్మాత. 85 శాతం చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ కలిగించేలా ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇప్పటిదాకా హైదరాబాద్‌, వైజాగ్‌లో చిత్రీకరణ చేశాం. ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ చిత్రంలో సీవీఎల్‌ నరసింహరావు, పూజా రామచంద్రన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మార్క్‌ రాబిన్‌ సంగీత దర్శకుడు. 


Updated Date - 2021-10-18T09:40:53+05:30 IST