సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఎరోటిక్‌గా తీశా... బోల్డ్‌గా కాదు!

ABN, First Publish Date - 2021-08-05T08:43:51+05:30

‘‘తల్లితండ్రులతో పాటు పిల్లలకు సందేశమిచ్చే చిత్రమిది. తెలుగు తెరపై ఇప్పటివరకూ ఎవరూ తీయని విధంగా రైలులో హీరో హీరోయిన్‌ మధ్య పరిచయ సన్నివేశం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘తల్లితండ్రులతో పాటు పిల్లలకు సందేశమిచ్చే చిత్రమిది. తెలుగు తెరపై ఇప్పటివరకూ ఎవరూ తీయని విధంగా రైలులో హీరో హీరోయిన్‌ మధ్య పరిచయ సన్నివేశం, తర్వాత మరో సన్నివేశం తీశా. టైటిల్‌, ప్రచార చిత్రాలు చూసి కొంతమంది ఏదో ఊహించుకుంటున్నారు. నేను ఎరోటిక్‌గా తీశా... బోల్డ్‌గా కాదు. రెండు మూడు సన్నివేశాలు మినహాయిస్తే సినిమా అంతా మరో కోణంలో ఉంటుంది’’ అని యుగంధర్‌ అన్నారు. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘ఇప్పుడుకాక ఇంకెప్పుడు’. హస్వంత్‌ వంగా, నమ్రతా దరేకర్‌ జంటగా చింతా గోపాలకృష్ణ (గోపీ) నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. యుగంధర్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు కావాలనేది నా కోరిక. ప్రొడక్షన్‌ మేనేజర్‌గా చేసే అవకాశం రావడంతో పరిశ్రమలోకి వచ్చా. శ్రీహరిగారి చిత్రాలు, వైజయంతి మూవీస్‌, పి. వాసుగారి దగ్గర పని చేశా. ఆ క్రమంలో అన్ని శాఖల గురించి తెలుసుకున్నా. ముఖ్యంగా ‘రాధాగోపాలం’ చిత్రానికి పనిచేసినప్పుడు బాపుగారిని చూసి చాలా నేర్చుకున్నా. దర్శకుడు కావాలని ‘సోలో’ తర్వాత ప్రొడక్షన్‌ మేనేజర్‌గా చేయడం మానేశా. స్టార్‌ హీరోలతో పని చేయాలని కథలు రాసుకుని అవకాశాల కోసం ప్రయత్నించా. అయితే, ఏదీ పట్టాలు ఎక్కలేదు. దర్శకుడిగా నన్ను నేను నిరూపించుకోవడం కోసం ‘ఇప్పుడుకాక ఇంకెప్పుడు’ రాశా. ఓ అబ్బాయి, అమ్మాయి తొందరపడి చేసే పనులు ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టాయనేది సినిమా కాన్సెప్ట్‌. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో టైటిల్‌ సాంగ్‌ ఉపయోగించాం. ‘భజగోవిందం’ లిరిక్‌ వచ్చినప్పుడు విజువల్స్‌ అభ్యంతకరంగా ఉన్నాయని కొంతమంది ఆందోళన చేశారు. నా పొరపాటును గుర్తించి ఆ ట్రైలర్‌ తొలగించాం. అలాగే, స్వచ్ఛందంగా సినిమాలో కొన్ని డైలాగులు మ్యూట్‌ చేశా. ఇప్పుడు వివాదం సద్దుమణిగింది. సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నా. ఈ సినిమా విడుదల తర్వాత తదుపరి సినిమా వివరాలు ప్రకటిస్తా. ప్రస్తుతం నా దగ్గర ఆరు కథలు సిద్ధంగా ఉన్నాయి. దేనికదే డిఫరెంట్‌ జానర్‌లో ఉంటుంది. రెండు అగ్ర నిర్మాణ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.


Updated Date - 2021-08-05T08:43:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!