వైష్ణవ్ తేజ్ మూవీలో మరో హీరోయిన్‌గా శోభితా రానా

ABN , First Publish Date - 2021-08-14T14:47:36+05:30 IST

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 3వ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు గిరీశయ్య. హీరోయిన్‌గా ఇప్పటికే 'రొమాంటిక్', 'లక్ష్య' చిత్రాలలో నటిస్తున్న కేతిక శర్మ ఇందులో నటిస్తోంది.

వైష్ణవ్ తేజ్ మూవీలో మరో హీరోయిన్‌గా శోభితా రానా

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 3వ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు గిరీశయ్య. హీరోయిన్‌గా ఇప్పటికే 'రొమాంటిక్', 'లక్ష్య' చిత్రాలలో నటిస్తున్న కేతిక శర్మ ఇందులో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ శోభితా రానాను సినిమాలో మరో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇటీవలే మీడియా ఇంటరాక్షన్‌లో ఆమె మాట్లాడుతూ.. ''ఇంత పెద్ద సినిమాలో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో భాగం కావడానికి ఇది గొప్ప సమయం అని నేను అనుకుంటున్నాను'' అని అన్నారు. కాగా శోభితా రానా హిందీ, కన్నడ చిత్రాలతో బాగానే పేరు తెచ్చుకుంది.

Updated Date - 2021-08-14T14:47:36+05:30 IST