సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అరుదైన అభినయం.. విలక్షణ వ్యక్తిత్వం

ABN, First Publish Date - 2021-03-20T04:29:46+05:30

‘నేను సాయంత్రం ఆరు గంటల తర్వాత షూటింగ్‌ స్పాట్‌లో ఉండను. ఆదివారాలు పని చేయను. మీకు ఇది ఇష్టమైతే నన్ను హీరోగా పెట్టుకోండి. లేకపోతే మరో హీరో దగ్గరకు వెళ్లండి’ ఇంత నిక్కచ్చిగా ఏ హీరో అయినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నేను సాయంత్రం ఆరు గంటల తర్వాత షూటింగ్‌ స్పాట్‌లో ఉండను. ఆదివారాలు పని చేయను. మీకు ఇది ఇష్టమైతే నన్ను హీరోగా పెట్టుకోండి. లేకపోతే మరో హీరో దగ్గరకు వెళ్లండి’ ఇంత నిక్కచ్చిగా ఏ హీరో అయినా మాట్లాడితే ఈ రోజుల్లో చెల్లుతుందేమో కానీ 40 ఏళ్ల క్రితం ఇలా మాట్లాడానికి ఎంత ధైర్యం కావాలి! అంత దమ్మున్న హీరో కావడం వల్లే శోభన్‌బాబు తన మాట చెల్లించుకోగలిగారు. ఆయన కండీషన్స్‌ ముందే ఒప్పుకొని సినిమా తీయడానికి నిర్మాతలు సిద్ధపడేవారు.


శోభన్‌బాబు దృష్టిలో స్టూడియో అనేది ఆఫీసు. షూటింగ్‌ ఉద్యోగం. సాయంత్రం ఆరు గంటలకు ఆఫీసు నుంచి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో గడిపేవారు ఆయన. ఉద్యోగస్తులకు ఆదివారం సెలవు రోజు కనుక తను కూడా ఆ రోజున షూటింగ్‌కు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యేవారు శోభన్‌బాబు. గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నా తనదైన ఓ విలక్షణమైన ప్రపంచాన్ని తొలి రోజుల నుంచీ ఏర్పాటు చేసుకొని, దాన్ని చివరి వరకూ భద్రంగా కాపాడు కొన్నారు. తాము రాణించిన రంగంలోనే వారసులు ఉండాలని ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రయత్నిస్తుంటారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా తన సంతానంలో ఎవరికీ సినిమా వాసన సోకకుండా దూరంగా పెంచారు శోభన్‌బాబు. హీరోగా తను అగ్రస్థానంలో ఉన్నా సినిమా వాతావరణాన్ని డ్రాయింగ్‌ రూమ్‌ దాటి ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదు.


హీరోగా శోభన్‌బాబు ఎంత గొప్పవారో ఇప్పుడు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందాల నటుడిగా, సోగ్గాడిగా, ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడుగా తనదైన అభినయాన్ని ఎన్నో చిత్రాల్లో ఆయన ప్రదర్శించారు. 


ఆరోగ్య క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కావడంతో తనూ 90 ఏళ్లు బతుకుతానని శోభన్‌బాబు అంటుండేవారు. కానీ ఆయన ఆ మాట నిలబెట్టుకోకుండా, తన 71వ ఏట ఆకస్మికంగా వెళ్లిపోయి, అభిమానులకు వేదన మిగిల్చారు.


(నేడు శోభన్‌బాబు వర్ధంతి)

Updated Date - 2021-03-20T04:29:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!