సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shiva rajkmar: ఆ ఫొటో చూస్తే కన్నీళ్లు ఆగట్లేదు!

ABN, First Publish Date - 2021-11-29T00:35:04+05:30

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణించి నెలరోజులు కావొస్తుంది. అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకాల నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. తరచూ ఆయన్ని తలచుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. పునీత్‌ సోదరుడు శివరాజ్‌కుమార్‌ తన తమ్ముడిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యాంతమవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణించి నెలరోజులు కావొస్తుంది. అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకాల నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. తరచూ ఆయన్ని తలచుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. పునీత్‌ సోదరుడు శివరాజ్‌కుమార్‌ తన తమ్ముడిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యాంతమవుతున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘తమ్ముడు మరణ వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అప్పూ నా పక్కనే ఉన్నట్టు.. శివన్న అని ప్రేమగా పిలుస్తున్నట్లు అనిపిస్తోంది. రోజులు క్షణాల్లా గడచిపోతున్నాయి. ఈ బాధ నుంచి నుంచి బయటకు రావడానికి వర్క్‌పై దృష్టి పెడుతున్నాను కానీ ఎక్కడకి వెళ్లినా తమ్ముడి ఫొటోలే కనిపిస్తున్నాయి. అది కనిపించిన ప్రతిసారీ కన్నీళ్లు ఆగడం లేదు. అందుకే వాటిని చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. కాసేపటికి తేరుకుంటున్నాను. జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా ఈ భూమిని వదలి వెళ్లాల్సిందే అనే జీవిత సత్యాన్ని గుర్తు తెచ్చుకొని ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నా తమ్ముడి కుటుంబానికి చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాను’’ అని శివరాజ్‌కుమార్‌ చెప్పారు. 

Updated Date - 2021-11-29T00:35:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!