సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇది నేను లైఫ్ లాంగ్ చెప్పుకునే సినిమా: శర్వానంద్

ABN, First Publish Date - 2021-12-30T03:36:12+05:30

శర్వానంద్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా అమల అక్కినేని ప్రధాన పాత్రలో శ్రీ కార్తిక్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తోన్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రానికి దర్శకుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శర్వానంద్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా అమల అక్కినేని ప్రధాన పాత్రలో శ్రీ కార్తిక్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తోన్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సినిమాపై భారీగా అంచనాలను పెంచేలా, ఒక వైవిధ్యమైన సబ్జెక్ట్‌తో మనసుకు హత్తుకునేలా ఈ చిత్రం తెరకెక్కిందనేది టీజర్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కాగా, టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘ఉన్నది ఒకే ఒక జీవితం అందరూ ఎంజాయ్ చేయండి. ఇది నా సినిమానో, శ్రీ కార్తీక్ సినిమానో కాదు.. ఇది వాళ్ల అమ్మ సినిమా. సినిమా నరేషన్ అప్పటి నుండే ఆమె మా వెనకాలే ఉండి నడిపిస్తోంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకు ఇచ్చినందుకు ప్రభుకు థాంక్స్. ఇది లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునే సినిమా. జేక్స్ బిజోయ్ అన్ని సాంగ్స్ చాలా చక్కగా ఇచ్చాడు. ముఖ్యంగా అమ్మ పాట గురించి చెప్పాలి. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి.. 9 నెలల పాటు రాశారు. దురదృష్టవశాత్తూ ఆయన ఇప్పుడు మన మధ్యలేరు. కానీ పాటల్లో ఎప్పుడూ జీవించే ఉంటారు. ఈ స్టోరి చెప్పగానే అమలగారు చేస్తున్నారా? అని అడిగాను. నేను ఈ పాత్రలో ఆమెను మాత్రమే ఊహించుకున్నాను. ఈ సినిమాకు ఆత్మ అమలగారి పాత్ర. అమ్మ పాటను రిలీజ్‌ చేయడం లేదు. ఒక చిన్న ఈవెంట్ చేసి.. కుదిరితే శాస్త్రిగారి అమ్మగారిని, అమలగారి అమ్మగారిని, మా అమ్మగారిని పిలిచి ఈ వేడుకలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం’’ అని అన్నారు.



Updated Date - 2021-12-30T03:36:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!