వావ్.. షాలినీ పాండే ఏముందిరా..! పిక్స్ వైరల్
ABN, First Publish Date - 2021-03-19T04:03:43+05:30
'అర్జున్ రెడ్డి' చిత్రంతో కుర్రాళ్ల కలల సుందరిగా మారిపోయిన షాలినీ పాండేకి.. ఆ తర్వాత అదృష్టం అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. అవకాశాలు అయితే వస్తున్నాయి
'అర్జున్ రెడ్డి' చిత్రంతో కుర్రాళ్ల కలల సుందరిగా మారిపోయిన షాలినీ పాండేకి.. ఆ తర్వాత అదృష్టం అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ.. 'అర్జున్ రెడ్డి' తరహా హిట్ మాత్రం ఆమెకు ఆ తర్వాత రాలేదు. పైగా కొందరు ఆమె ప్రత్యేకించి టార్గెట్ చేస్తూ.. ఆకారంపై కామెంట్స్ చేస్తుండటంతో.. సీరియస్‌గా తీసుకున్న షాలినీ.. ఇప్పుడు లుక్ మార్చింది. ఎక్కడెక్కడ తనకు మైనస్ అనిపించిందో.. అక్కడ స్లిమ్‌గా తయారై.. ఎలా ఉన్నానో చెప్పండి అంటూ.. సోషల్ మీడియాకి కొన్ని పిక్స్ వదిలింది. ఇప్పుడీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షాలినీ పాండేకి సరైన హిట్ లేకపోవడంతో.. ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రయత్నాలు మొదలెట్టింది. బాలీవుడ్‌లో అల్రెడీ ఓ స్టార్ హీరో చిత్రంలో చేస్తున్న షాలినీకి.. మరో రెండు మూడు అవకాశాలు కూడా వరించినట్లుగా తెలుస్తుంది. అందుకేనేమో.. ఇలా లుక్ మార్చి షాకిస్తుంది. బాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా స్లిమ్‌గా ఉండే హీరోయిన్లలే లైక్ చేస్తుంటారు. కత్రినా, కరీనా, ప్రియాంక, దీపికా.. వంటి వారందరూ ఇప్పటికీ సన్నగానే కనిపించడానికి కారణం అదే. అలాగే ఇప్పుడు టాక్ ఆఫ్ ద బాలీవుడ్ అవుతున్న కియారా, అనన్య వంటి వారు కూడా ఎలా బాడీని మెయింటైన్ చేస్తున్నారో తెలిసిందే. ఇప్పుడు వారి దారిలోనే షాలినీ కూడా లుక్ మార్చి.. నెటిజన్లకి కిక్ ఇస్తోంది. మరి ఈ లుక్ ఆమెను ఎలా బిజీ చేస్తుందో చూద్దాం.