ఏదో తప్పు చేసి దొరికినట్టు.. ‘శాకిని డాకిని’ లుక్‌

ABN , First Publish Date - 2021-12-14T00:13:28+05:30 IST

రెజీనా, నివేదా థామస్‌ కీలక పాత్రల్లో సురేష్‌ ప్రొడక్షన్స్‌, గురు ఫిలిమ్స్‌, క్రాస్‌ పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’. డి.సురేష్‌ బాబు, సునీత తాటి, హ్యున్‌ వ్యూ థామస్‌ కిమ్‌ నిర్మాతలు. సుధీర్‌వర్మ దర్శకుడు. సోమవారం రెజీనా పుట్టినరోజు సందర్భంగా రెజీనా లుక్‌ను విడుదల చేశారు.

ఏదో తప్పు చేసి దొరికినట్టు.. ‘శాకిని డాకిని’ లుక్‌

రెజీనా, నివేదా థామస్‌ కీలక పాత్రల్లో సురేష్‌ ప్రొడక్షన్స్‌, గురు ఫిలిమ్స్‌, క్రాస్‌ పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’. డి.సురేష్‌ బాబు, సునీత తాటి, హ్యున్‌ వ్యూ థామస్‌ కిమ్‌ నిర్మాతలు. సుధీర్‌వర్మ దర్శకుడు. సోమవారం రెజీనా పుట్టినరోజు సందర్భంగా రెజీనా లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెజానీ, నివేదా థామస్‌ ఇద్దరూ కూడా మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్‌ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా కోసం హీరోయిన్లు ఇద్దరూ మొదటిసారి యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేశారు. ‘‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ రీమేక్‌ ఇది. కథలో  గ్లోబల్‌ అప్పిల్‌ ఉంటుంది. తెలుగు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది. షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది’’ అని నిర్మాతలు చెప్పారు. 


Updated Date - 2021-12-14T00:13:28+05:30 IST