పాయల్ రాజ్‌పుత్‌తో సినిమా చేస్తున్నా!
ABN , First Publish Date - 2021-05-15T04:12:57+05:30 IST
‘‘కథ నచ్చితేనే సినిమా చేస్తా. ఒకసారి కథ ఖరారు చేసి, చిత్రీకరణ ప్రారంభించాక నిర్మాణంలో రాజీ పడను’’ అన్నారు ‘సెవెన్ హిల్స్’ సతీశ్‌కుమార్. పాయల్ రాజ్‌పుత్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు....

‘సెవెన్ హిల్స్’ సతీశ్‌కుమార్
‘‘కథ నచ్చితేనే సినిమా చేస్తా. ఒకసారి కథ ఖరారు చేసి, చిత్రీకరణ ప్రారంభించాక నిర్మాణంలో రాజీ పడను’’ అన్నారు ‘సెవెన్ హిల్స్’ సతీశ్‌కుమార్. పాయల్ రాజ్‌పుత్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇంకా సతీశ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘ఉగాది సందర్భంగా మా సంస్థలో ప్రారంభించిన చిత్రంలో పాయల్ నటించనున్నారు. పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్యాక్‌డోర్’కి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నా. ఇక, రామ్ వీరపనేనితో కలిసి నేను నిర్మించిన ‘బట్టలరామస్వామి బయోపిక్కు’ శుక్రవారం ‘జీ5’లో విడుదలైంది. దానికి హిట్ టాక్ రావడం సంతోషంగా ఉంది. ఇకపై మరిన్ని మంచి చిత్రాలు చేస్తా’’ అని చెప్పారు.