5న సేతుపతి ‘విక్రమార్కుడు’

ABN , First Publish Date - 2021-03-03T10:08:20+05:30 IST

విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘జుంగా’, తెలుగులో ‘విక్రమార్కుడు’ పేరుతో ఈ నెల 5న విడుదల కానుంది...

5న సేతుపతి ‘విక్రమార్కుడు’

విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘జుంగా’, తెలుగులో ‘విక్రమార్కుడు’ పేరుతో ఈ నెల 5న విడుదల కానుంది. మంగళవారం ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకులు సూర్యకిరణ్‌, అమ్మ రాజశేఖర్‌ పోస్టర్స్‌ను వీరశంకర్‌ టీజర్‌ను ఆవిష్కరించారు. చిత్ర సమర్పకులు వాయల శ్రీనివాసరావు ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘గతంలో నేను తీసిన ‘కాష్మోరా’ లానే ఈ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని దర్శకుడు గోకుల్‌ చెప్పారు. ఈ చిత్రానికి కాకర్లమూడి రవీంద్ర కల్యాణ్‌, అప్పసాని సాంబశివరావు నిర్మాతలు.

Updated Date - 2021-03-03T10:08:20+05:30 IST