యాషికా ఆనంద్‌కు తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2021-07-26T09:25:24+05:30 IST
నటి, తమిళ బిగ్‌బాస్ ఫేం యాషికా ఆనంద్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె స్నేహితురాలు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్...
నటి, తమిళ బిగ్‌బాస్ ఫేం యాషికా ఆనంద్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె స్నేహితురాలు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వల్లిచెట్టి భవాని అక్కడికక్కడే మృతిచెందారు. యాషికా పరిస్థితి విషమంగా ఉంది. ఆమెతో పాటు మిగిలినవారినీ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. శనివారం అర్థరాత్రి యాషికా ప్రయాణిస్తున్న కారు చెంగల్‌పట్టు జిల్లా మాహాబలిపురం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మద్యంమత్తులో కారునడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. మోడల్‌గా, బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన యాషికా 2016లో ‘దురువంగల్ పత్తినారు’ చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ సినిమాతో నటిగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘బిగ్‌బాస్ 2’ తమిళ్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు యాషికా మరింత చేరువయ్యారు.