సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Jayanthi: జయంతితో అక్కినేని కుటుంబానికున్న సంబంధమేంటి?

ABN, First Publish Date - 2021-07-26T18:50:19+05:30

దాదాపు ద‌క్షిణాది అగ్ర క‌థానాయ‌కులంద‌రి సినిమాల్లోనూ జ‌యంతి న‌టించారు. టాలీవుడ్‌లో నాటి అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన అక్కినేని తో కలసి చాలా సినిమాలు చేశారు జయంతి. అయితే అవన్నీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోయిన్‌గా, న‌టిగా ద‌క్షిణాది స‌హా హిందీ సినిమాల్లో గుర్తింపు సంపాదించుకున్న జ‌యంతి ఆదివారం రాత్రి క‌న్నుమూశారు. ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌తో ఆమెకు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. దాదాపు ద‌క్షిణాది అగ్ర క‌థానాయ‌కులంద‌రి సినిమాల్లోనూ జ‌యంతి న‌టించారు. టాలీవుడ్‌లో నాటి అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన అక్కినేని తో కలసి చాలా సినిమాలు చేశారు జయంతి.  అయితే అవన్నీ చెల్లెలి పాత్రలే. ఆయన సరసన నటించే అవకాశం మాత్రం జయంతి కి రాలేదు. అక్కినేని అంటే ఆమె కుటుంబ సభ్యులకు చాలా ఇష్టం. ఆమె తమ్ముడికి ఆయన పేరే పెట్టారు. అలాగే అక్కినేని కుటుంబ స‌భ్యులు కూడా జ‌యంతిని ఎంతో ఇష్ట‌ప‌డేవారు. 


త‌ర్వాత త‌రంలో ఆమె శోభన్ బాబు తో కలసి చాలా చిత్రాల్లో నటించారు. మాంగల్యం, శారద, జీవితం.. పేరు తెచ్చిన చిత్రాలు. దక్షిణాది లో టాప్ హీరోలు అందరితో నటించిన జయంతి కన్నడ రాజ్ కుమార్ తో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. న‌టిగా కె.వి.రెడ్డి, కె.విశ్వనాధ్, కె.బాలచందర్ నటిగా తన ఉన్నతికి కారణమ‌ని, తాను నమ్ముకున్న వాళ్ళు మోసం చేసినా, అభిమానుల  ఆదరభిమానాలే తనకు శ్రీరామరక్ష అనేవారు జయంతి. 

Updated Date - 2021-07-26T18:50:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!