ఆకట్టుకుంటోన్న ‘సేనాపతి’ మూవీ ట్రైలర్
ABN , First Publish Date - 2021-12-29T20:37:06+05:30 IST
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో.. ‘ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి’ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ వెబ్ సిరీస్ ‘సేనాపతి’. గోల్డ్ బాక్స్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 31 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కామన్‌మేన్ సేనాపతిగా రాజేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో నటిస్తున్నారు. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. రాజేంద్ర ప్రసాద్ మేకోవర్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటున్నాయి.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో.. ‘ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి’ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘సేనాపతి’. గోల్డ్ బాక్స్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 31 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కామన్‌మేన్ సేనాపతిగా రాజేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో నటిస్తున్నారు. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. రాజేంద్ర ప్రసాద్ మేకోవర్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘నిజాయితీగా బ్రతకడం అన్నది మన నిర్ణయం కృష్ణా.. నువ్వెక్కడున్నా ఏం చేసినా.. మంచి, చెడూ రెండూ చూడాలి. ఆ రెండిటి మధ్యా ఎదగాలి’ అనే డైలాగ్ మీద ట్రైలర్ ప్రారంభమవుతుంది.
ఓ యంగ్ పోలీసాఫీసర్ ఒక క్రిమినల్ ను పట్టుకొనే ప్రోసెస్ లో తన గన్ పోగొట్టుకుంటాడు. ఆ గన్ అన్వేషణలో అతడుంటాడు. ఇంతలో గన్ దొరికిన సేనాపతి దాంతో మర్డర్స్, బ్యాంక్ దోపిడీ చేస్తుంటాడు. అలాగే దోచుకున్న డబ్బునంతటినీ రోడ్డు మీద వెదజల్లుతాడు. తనెవరో ఇతరులు కనిపెట్టకుండా ఉండడానికి మంకీ క్యాప్ పెట్టుకుంటాడు సేనాపతి. ఇంతకీ సేనాపతి అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి? అన్న విషయం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ‘ఇదేంటో తెలుసా.. సేనాపతి దీంతో జాగ్రత్తగా ఉండాలి..’ అనే రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందిన ‘సేనాపతి’ మూవీ రాజేంద్ర ప్రసాద్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.