నేనే హీరో... విలన్!
ABN , First Publish Date - 2021-09-13T05:39:38+05:30 IST
‘‘నా తొలి చిత్రం ‘మౌన పోరాటం’లో నేనే హీరో, విలన్. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి భిన్న ఛాయలున్న పాత్రను పోషించా’’ అని వినోద్‌కుమార్ అన్నారు....
‘‘నా తొలి చిత్రం ‘మౌన పోరాటం’లో నేనే హీరో, విలన్. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి భిన్న ఛాయలున్న పాత్రను పోషించా’’ అని వినోద్‌కుమార్ అన్నారు. తాన్యా దేశాయ్, అంకిత్ రాజ్, కావ్యా రెడ్డితో పాటు ఆయన నటించిన చిత్రం ‘స్ట్రీట్ లైట్’. విశ్వ ప్రసాద్ దర్శకత్వంలో మామిడాల శ్రీనివాస్ నిర్మించారు. ఈ నెల మూడో వారంలో తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నట్టు నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించి ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో నిర్మాతలు ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.