మంత్రి హరీష్ రావుకు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2021-12-30T01:45:32+05:30 IST

తెలంగాణ వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్ రావుకు దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్లుగా శేఖర్ కమ్ముల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఆయనకు నిత్యం ఎవరో ఒకరి దగ్గర నుంచి అత్యవసర

మంత్రి హరీష్ రావుకు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు

తెలంగాణ వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్ రావుకు దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్లుగా శేఖర్ కమ్ముల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఆయనకు నిత్యం ఎవరో ఒకరి దగ్గర నుంచి అత్యవసర వైద్య చికిత్స కేసులు వస్తుంటాయి. అందులో భాగంగా వరంగల్‌కు చెందిన యువకుడు హర్షవర్ధన్‌.. క్రాన్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ శేఖర్ కమ్ముల సహయాన్ని కోరారు. హర్షవర్ధన్ పరిస్థితిని వెంటనే శేఖర్ కమ్ముల మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా.. తక్షణమే స్పందించిన ఆయన నిమ్స్‌లో హర్షవర్ధన్‌కు అత్యవసర వైద్యం అందించేలా ఆదేశాలు ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన హరీష్ రావుకు సోషల్ మీడియా ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. హరీష్ రావుని ప్రజల మంత్రి అని పిలిచేందుకు ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చని శేఖర్ కమ్ములు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాగా, శేఖర్ కమ్ముల ట్వీట్ చూసిన మంత్రి హరీష్ రావు కూడా హర్షవర్ధన్ హెల్త్ అప్‌డేట్‌పై సంతోషం వ్యక్తం చేశారు. ‘‘హర్షవర్ధన్ కోలుకుని.. క్షేమంగా ఉన్నాడని తెలిసి చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నిమ్స్ వైద్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీఎం కేసీఆర్‌గారి నేతృత్వంలోని మా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది..’’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.Updated Date - 2021-12-30T01:45:32+05:30 IST