సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వేసవి బరిలో గోపీచంద్!

ABN, First Publish Date - 2021-01-28T18:19:52+05:30

మాచో హీరో గోపీచంద్ కూడా వేసవి బరిలోకి దిగాడు. తన కొత్త సినిమా `సీటీమార్`ను విడుదల చేస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాచో హీరో గోపీచంద్ కూడా వేసవి బరిలోకి దిగబోతున్నాడు. తన కొత్త సినిమా `సీటీమార్`ను విడుదల చేస్తున్నాడు. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది.


తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. వేసవి సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు గోపీచంద్ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటించింది. మణిశర్మ సంగీతం అందించారు. 




Updated Date - 2021-01-28T18:19:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!