త్వరలో కలుద్దాం!

ABN , First Publish Date - 2021-10-04T07:35:38+05:30 IST

‘‘నా మీద, ‘రిపబ్లిక్‌’ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పడానికి థ్యాంక్స్‌ అనేది చిన్న పదమే’’ అని హీరో సాయితేజ్‌ ట్వీట్‌ చేశారు...

త్వరలో కలుద్దాం!

‘‘నా మీద, ‘రిపబ్లిక్‌’ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పడానికి థ్యాంక్స్‌ అనేది చిన్న పదమే’’ అని హీరో సాయితేజ్‌ ట్వీట్‌ చేశారు. ఆయన హీరోగా నటించిన ‘రిపబ్లిక్‌’ ఈ నెల 1న విడుదలైంది. దానికి కొన్ని రోజుల ముందు ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయితేజ్‌కు ఫిజియో థెరపీ చికిత్స అందిస్తున్నారని, ఓ వారంలో ఇంటికి రావచ్చని వైష్ణవ్‌తేజ్‌ తెలిపారు. మరోవైపు... ‘‘నటుడిగా సాయితేజ్‌ను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసిన సినిమా ‘రిపబ్లిక్‌’. నేటి సమాజంలో పరిస్థితులను ఆవిష్కరించేలా... రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవ్యవస్థను మూడు గుర్రాలతో పోల్చి, అవి ఎలా ఉండాలి? ఎలా ఉన్నప్పుడు సామాన్యులకు న్యాయం జరుగుతుందనేది  దేవ కట్టా చెప్పారు. నిర్మాతలు జె. భగవాన్‌, జె. పుల్లారావుకు, జీ స్టూడియో్‌సకు, చిత్రబృందానికి అభినందనలు’’ అని పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ తెలిపారు. 

సమాజానికి  మంచి సందేశం ఇచ్చారు : రేవంత్‌రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివారం ‘రిపబ్లిక్‌’ చూసి చిత్రబృందాన్ని ప్రశంసించారు. ‘‘సినిమాలో చూపించిన సమస్య ఓ ప్రాంతానిది కాదు... అన్ని సంస్థలు, వ్యక్తులకు సంబంధించినది. దీంట్లో మంచి సందేశం ఇచ్చారు. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తినిచ్చే చిత్రమిది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.


Updated Date - 2021-10-04T07:35:38+05:30 IST