సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కొత్త అఖిల్‌ను చూస్తారు!

ABN, First Publish Date - 2021-10-12T06:25:05+05:30

‘‘నేను నిర్మాత కావాలనుకోలేదు. దర్శకుడిగా చేయబోయే సినిమా కోసం కథ సిద్ధం చేసుకుంటున్నా. అప్పుడు ప్రొడక్షన్‌లోకి రమ్మని ‘బన్నీ’ వాసు ఒత్తిడి చేశాడు. ఆల్రెడీ ‘బొమ్మరిల్లు’కు పని చేసి ఉండటంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘నేను నిర్మాత కావాలనుకోలేదు. దర్శకుడిగా చేయబోయే సినిమా కోసం కథ సిద్ధం చేసుకుంటున్నా. అప్పుడు ప్రొడక్షన్‌లోకి రమ్మని ‘బన్నీ’ వాసు ఒత్తిడి చేశాడు. ఆల్రెడీ ‘బొమ్మరిల్లు’కు పని చేసి ఉండటంతో... భాస్కర్‌ దర్శకత్వంలో అనగానే సరే అన్నాను. రచన, దర్శకత్వ విభాగాల్లో గతంలో పని చేసిన చిత్రాలకు ఎంత కష్టపడ్డానో... ఈ చిత్రానికీ అంతే కష్టపడ్డా. అయితే, నిర్మాతగా పేరు వేశారు. అనుకోకుండా దక్కిన క్రెడిట్‌ అది’’ అని వాసు వర్మ అన్నారు. ఆయన నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. వాసు వర్మ మాట్లాడుతూ ‘‘పెళ్లికి ఉద్యోగం, జాతకాలు, ఆస్తితో పాటు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అవన్నీ చూసి వివాహాలు చేసుకున్నవారు సంతోషంగా ఉన్నారా? లేదా? అనే కథతో భాస్కర్‌ సినిమా తీశాడు. ‘బొమ్మరిల్లు’లోని పాత్రల్లో ప్రేక్షకులు తమను తాము ఎలా చూసుకున్నారో... ఆ సినిమాలోని పాత్రల్లోనూ అలాగే చూసుకుంటారు. సమాజం నుంచి వచ్చిన కథ ఇది. ఇందులో కొత్త అఖిల్‌ను చూస్తారు. ఆయన పాత్రలో రెండు షేడ్స్‌ ఉంటాయి. రెండిటిలోనూ అద్భుతంగా నటించారు. అఖిల్‌, పూజ మధ్య కెమిస్టీ కూడా చాలా బావుంటుంది. నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఇప్పుడు దర్శకుడిగా సినిమా చేయాలని కథ సిద్ధం చేసుకుంటున్నా. వెబ్‌ సిరీస్‌లు చేయమని ఓటీటీ వేదికల నుంచి అవకాశాలొచ్చాయి. అయితే, సినిమా తీసి సక్సెస్‌ అందుకోవాలనుంది’’ అని చెప్పారు.


Updated Date - 2021-10-12T06:25:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!