'గాడ్సే'గా మారిన సత్యదేవ్
ABN , First Publish Date - 2021-01-03T20:32:14+05:30 IST
విలక్షణమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ మరో కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. 'గాడ్సే' టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది

విలక్షణమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ మరో కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. 'గాడ్సే' టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో సత్యదేవ్ ఏదో విషయాన్ని తీక్షణంగా చూస్తున్నారు. ఆయన వెనుక మిషన్ గన్ ఉంది. ఇలాంటి టైటిల్లో సినిమా చేయడమంటే కాస్త సాహసమనే చెప్పాలి. ఇది వరకు సత్యదేవ్‌తో 'బ్లఫ్ మాస్టర్' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గోపీగణేశ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సీకే స్క్రీన్స్ పేరుతో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.