పాట సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకున్న ‘శశి’ టీమ్‌

ABN , First Publish Date - 2021-02-02T04:15:24+05:30 IST

లవ్లీ రాక్ స్టార్ ఆది సాయికుమార్, అందాల భామ సురభి హీరోహీరోయిన్లుగా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై

పాట సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకున్న ‘శశి’ టీమ్‌

లవ్లీ రాక్ స్టార్ ఆది సాయికుమార్, అందాల భామ సురభి హీరోహీరోయిన్లుగా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శశి'. ఈ చిత్రంలోని 'ఒకే ఒక లోకం' సాంగ్‌ యూట్యూబ్‌లో 21 మిలియన్స్ ప్లస్‌ వ్యూస్‌ సాధించడంతో చిత్రయూనిట్‌ సాంగ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ గెస్ట్‌గా హాజరై చిత్రయూనిట్‌కు ప్లాటినమ్ డిస్క్‌లను అందజేశారు.  


ఈ కార్యక్రమంలో హీరోయిన్ సురభి మాట్లాడుతూ.. "వెరీ వెరీ స్పెషల్ డే. పాట బిగ్ హిట్ అవడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. చంద్రబోస్‌గారు మంచి లిరిక్స్, అరుణ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. వారికి నా థాంక్స్. సిద్ శ్రీరామ్ గ్రేట్ సింగర్. సూపర్బ్‌గా పాడారు. ఆదితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే నిర్మాత వర్మ మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. శ్రీనివాస్ నాయుడు ఫెంటాస్టిక్‌గా మూవీ తెరకెక్కించారు. తప్పకుండా 'శశి' చిత్రం బిగ్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.." అన్నారు.


పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. "2020లో కరోనాకి ముందు 'నీలి నీలి ఆకాశం' పాట రాగజ్యోతిలా నాకు కొత్త వెలుగునిచ్చింది. 2021లో 'ఒకే ఒక లోకం నువ్వే' పాట అందరి మనసుల్ని గెలిచి రంజింపచేస్తుంది. అరుణ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా మంచి బాణీలు సమకూర్చారు. సిద్, అమృత గాత్రంతో ఈ పాట కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థాంక్స్. ఆదికి ఫస్ట్ టైం పాట రాశాను. అతనికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి.." అన్నారు.


సంగీత దర్శకుడు అరుణ్ మాట్లాడుతూ.. "చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఏదో ఒక ట్యూన్ చేసుకుంటూ ఉంటాను. ఈ సినిమా గొప్ప అనుభూతిని కలిగించింది. ఒకే ఒక పాట ఇంత పెద్ద హిట్ అవడం షాకింగ్‌లా ఉంది. చంద్రబోస్ గారి క్రియేటివిటీ అన్ లిమిటెడ్ గా ఉంటుంది. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే పాట రాశారు. ఈ అవకాశం ఇచ్చిన వర్మ గారికి, శ్రీనివాస్ నాయుడుకి థ్యాంక్స్." అన్నారు.


హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. "ఒకే ఒక పాటని చాలా మంది రింగ్ టోన్‌గా పెట్టుకున్నారు. ఈ విషయం నేను ప్రత్యక్షంగా చూశాను. సాంగ్ చాలా పెద్ద హిట్‌ అయి 21 మిలియన్స్ వ్యూస్ రావడం సర్‌ప్రైజ్‌గా ఉంది. ఇంతలా ఆదరించి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అరుణ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. చంద్రబోస్‌గారు ఫస్ట్ టైమ్ నాకు పాట రాశారు. గొప్పగా ఆలపించిన సిద్ శ్రీరామ్‌కి స్పెషల్ థాంక్స్. మా నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చ్ 19న 'శశి' మూవీ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. రియల్ సతీష్ నేచురల్‌గా ఉండేలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. సురభి అందంతో పాటు మంచి టాలెంటెడ్ నటి. అమర్ ప్రతీ ఫ్రేమ్ అందంగా తీర్చిదిద్దారు. చిరంజీవిగారు టీజర్ రిలీజ్ చేసి.. 'విజువల్స్ బ్యూటిఫుల్‌గా ఉన్నాయి'.. అని బ్లెస్‌ చేశారు. ఆయనకి నా స్పెషల్ థాంక్స్.." అన్నారు.

Updated Date - 2021-02-02T04:15:24+05:30 IST