సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

`సర్కారు వారి పాట`లు ఆగస్టులో..?

ABN, First Publish Date - 2021-02-21T15:53:39+05:30

సంగీత దర్శకుడు తమన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. `అల వైకుంఠపురములో..` ఇచ్చిన జోష్‌తో కెరీర్‌లో అత్యుత్తమ దశకు చేరాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగీత దర్శకుడు తమన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. `అల వైకుంఠపురములో..` ఇచ్చిన జోష్‌తో కెరీర్‌లో అత్యుత్తమ దశకు చేరాడు. ప్రస్తుతం అగ్ర హీరోలందరి సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న `సర్కారు వారి పాట` సినిమాకు కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల దుబాయ్ వెళ్లి మహేష్‌‌ను కలిసి వచ్చాడు. ఈ పాటల గురించి మహేష్ అభిమానులు తమన్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.


 `సర్కారు వారి పాట` సినిమా పాటల గురించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వమని ఇటీవల ఓ అభిమాని ట్విటర్ ద్వారా తమన్‌ను అడిగాడు. దీనికి స్పందించిన తమన్.. `సినిమా విడుదలకు చాలా సమయం ఉంది. ఈ సినిమా పాటలు అద్భుతంగా ఉండబోతున్నాయి. అది మాత్రం ఫిక్స్‌. ఆగస్టులో కలుద్దాం` అని రిప్లై ఇచ్చాడు. దీంతో `సర్కారు వారి పాట` తొలి సింగిల్ మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టులో విడుదల కాబోతోందని అభిమానులు చర్చించుకుంటున్నారు. 

Updated Date - 2021-02-21T15:53:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!