మనాలిలో ఆ హీరోతో ఊర్వశి రౌతెలా హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-03-20T23:37:00+05:30 IST

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఆ హీరోతో మనాలీలో హల్ చల్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు

మనాలిలో ఆ హీరోతో ఊర్వశి రౌతెలా హల్‌చల్‌

కోలీవుడ్‌: ప్రముఖ వస్త్రదుకాణం శరవణ స్టోర్స్‌ అధినేత శరవణన్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. జెడీ - జెర్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను చిత్ర యూనిట్‌ మీడియాకు తెలియజేసింది. ఇటీవలే హీరో శరవణన్‌ పాల్గొన్న కొన్ని పోరాట దృశ్యాలను చిత్రీకరించారు. వీటికి సంబంధించిన స్టిల్స్‌ రిలీజ్‌ చేయగా, అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్‌ మనాలి వెళ్ళింది. అక్కడ హీరో, హీరోయిన్లతో పాటు హాస్యనటుడు వివేక్‌లపై పలు సన్ని వేశాలను చిత్రీకరిస్తున్నారు. వాటి ఫొటోలను తాజాగా రిలీజ్‌ చేశారు.


ఈ చిత్రం షూటింగ్‌ వివరాలపై హాస్య నటుడు వివేక్‌ మాట్లాడుతూ.. హీరో శరవణన్‌ నటన చూసేందుకు ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్‌కు క్యూ కడుతారన్నారు. దర్శకులు జేడీజెర్రీలు ప్రత్యేక శ్రద్ధతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, ఇది ఖచ్చితంగా ప్రజలు మెచ్చే చిత్రంలా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా శరవణన్‌తో కలిసి నటించడం తనకు కొత్త అనుభూతిని మిగిల్చిందన్నారు. కాగా, ఈ చిత్రంలోని ఓ పాట కోసం పది కోట్ల ఖర్చుతో భారీ సెట్‌ వేసి, అందులో చిత్రీకరించినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.





Updated Date - 2021-03-20T23:37:00+05:30 IST