ఒక ‘చిన్న విరామం’ తర్వాత ‘సరసాలు చాలు’

ABN , First Publish Date - 2021-12-29T22:03:35+05:30 IST

సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లోని

ఒక ‘చిన్న విరామం’ తర్వాత ‘సరసాలు చాలు’

సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత భార్య శృతిరెడ్డి క్లాప్ కొట్టగా.. నిర్మాత చంద్రకాంత్ రెడ్డి, రోహిత్‌లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ‘లూజర్’ వెబ్ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా.. మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు.


అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత బి. చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి సినిమా అంటే ఎంతో ఇష్టం ఉండడంతో  సందీప్ చెప్పిన కథ నచ్చి ఈ మూవీ నిర్మిస్తున్నాను. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇకపై మా బ్యానర్‌లో ఇలాంటి మంచి సినిమాలు వరసగా చేస్తాము.. అని తెలిపారు. చిత్ర దర్శకుడు డాక్టర్ సందీప్ చేగూరి మాట్లాడుతూ.. ‘‘ఒక ‘చిన్న విరామం’ సినిమా తర్వాత వస్తున్న నా రెండవ చిత్రం ‘సరసాలు చాలు’. పేరుకు తగ్గట్టే ఈ సినిమా చాలా కలర్ ఫుల్ బ్రీజి ఎంటర్ టైనర్. కామెడీకి పెద్ద పీట వేస్తూ సాగే ఫుల్ కామెడీ క్లిన్ ఎంటర్‌టైనర్. ప్రతి కపుల్‌కి, రిలేషన్ షిప్‌లో ఉన్న వాళ్ళకి, పెళ్లైన వాళ్ళకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో ఈ చిత్రం ఉంటుంది. ఇందులో  కూడా ఎమోషన్స్, హార్ట్ బ్రేక్స్, నవ్వులు, కోపాలు ఉంటాయి. మంచి రొమాంటిక్ కామెడీతో వస్తున్న ఈ చిత్రంలో అద్భుతమైన నాలుగు పాటలు ఉంటాయి. మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేసి సమ్మర్‌లో విడుదల చేస్తాము..’’ అని తెలిపారు. ఇలాంటి మంచి చిత్రంలో అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు హీరో నరేష్ అగస్త్య మరియు హీరోయిన్ సంజన సారధి.

Updated Date - 2021-12-29T22:03:35+05:30 IST