రణ్‌బీర్.. సందీప్ వంగా.. `యానిమల్`!
ABN, First Publish Date - 2021-01-01T19:02:42+05:30
`అర్జున్ రెడ్డి` సినిమాతో దక్షిణాదిలోనూ, దాని రీమేక్ `కబీర్ సింగ్`తో బాలీవుడ్‌లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా
`అర్జున్ రెడ్డి` సినిమాతో దక్షిణాదిలోనూ, దాని రీమేక్ `కబీర్ సింగ్`తో బాలీవుడ్‌లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. లాంగ్ గ్యాప్ తీసుకున్న సందీప్ తర్వాతి సినిమా గురించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో సందీప్ సినిమా చేయబోతున్నాడు.
గ్యాంగస్టర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి `యానిమల్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పరిణీతి చోప్రా హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో బాబీ డియోల్, అనీల్ కపూర్ కీలక పాత్రలు పోషించబోతున్నారు. టీ-సిరీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ వీడియోను విడుదల చేశారు.