సందీప్ కిషన్ - వీఐ ఆనంద్ కాంబోలో మరో సినిమా ప్రారంభం

ABN , First Publish Date - 2021-09-20T00:44:19+05:30 IST

ఇటీవల ‘గల్లీ రౌడీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన యంగ్ హీరో సందీప్ కిషన్.. త్వరలో ‘నరకాసురన్’ అనే తమిళ మూవీ తో రాబోతున్నారు.

సందీప్ కిషన్ - వీఐ ఆనంద్ కాంబోలో మరో సినిమా ప్రారంభం

ఇటీవల ‘గల్లీ రౌడీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన యంగ్ హీరో సందీప్ కిషన్..  త్వరలో ‘నరకాసురన్’ అనే తమిళ మూవీ తో రాబోతున్నారు.  ప్రస్తుతం ఈ హీరో  వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు వీఐ ఆనంద్‌తో క‌లిసి సందీప్ కిషన్ మ‌రో  ప్రాజెక్ట్ చేయబోతోన్నారు. ఇంతకు ముందు సందీప్ కిషన్  ఆనంద్  దర్శకత్వంలో ‘టైగర్’ అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఇప్పుడు ఈ ఇద్దరూ చేయబోతున్న సినిమాకు  స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  హాస్య మూవీస్ బ్యానర్‌పై  ప్రొడక్షన్ నెంబర్ 1గా  రాజేష్ దండా  నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. 


ముహూర్త‌పు స‌న్నివేశానికి  అల్లరి నరేష్ క్లాప్ కొట్టారు. నాగ శౌర్య కెమెరా స్విచ్చాన్ చేశారు. జెమినీ కిరణ్, నిర్మాత సుధీర్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. నాంది  డైరెక్టర్ విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. దియా ఫేమ్ ఖుషీ రవి, ఏక్ మినీ కథ ఫేమ్ కావ్యా థాపర్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శేఖర్  చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు.  అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Updated Date - 2021-09-20T00:44:19+05:30 IST