సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కటారి కృష్ణ కొత్త అవతారం..

ABN, First Publish Date - 2021-01-26T04:55:37+05:30

విలక్షణ నటుడు సముద్రఖని హీరోగా ‘నాన్‌ కడవుల్‌ ఇలె’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ కథను సమకూర్చి దర్శకత్వం వహించడమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్‌: విలక్షణ నటుడు సముద్రఖని హీరోగా ‘నాన్‌ కడవుల్‌ ఇలె’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ కథను సమకూర్చి దర్శకత్వం వహించడమే కాకుండా న్యాయవాదిగా నటిస్తున్నారు. ఇందులో సముద్రఖనికి జోడీగా ఇనియాను ఎంపికచేశారు. ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో సాక్షి అగర్వాల్‌ నటిస్తుండగా, ప్రతి నాయకుడిగా ‘పరుత్తివీరన్‌’ శరవణన్‌ నటిస్తున్నారు. వీరితో పాటు రోహిణి, యువన్‌ మైయిల్‌స్వామి, అభి శరవణన్‌, ప్రియాంకా, మాయక్క, డయానాశ్రీ, మురుగానందం, ఇమాన్‌ అన్నాచ్చి తదితరులు నటిస్తున్నారు. 


ఈ చిత్రం గురించి దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. తాను గతంలో చిన్నారులను కథాంశంగా చేసుకుని ఓ షార్ట్‌ఫిల్మ్‌ తీశానని దీన్ని చూసిన సముద్రఖని ఫోన్‌ చేసి ఈ షార్ట్‌ఫిల్మ్‌ను సినిమాగా తెరకెక్కిస్తే తాను హీరోగా నటిస్తానని చెప్పారని, ఆ కారణంగానే ఈ చిత్రం తెరకెక్కనుందని వివరించారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

Updated Date - 2021-01-26T04:55:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!