కటారి కృష్ణ కొత్త అవతారం..
ABN , First Publish Date - 2021-01-26T04:55:37+05:30 IST
విలక్షణ నటుడు సముద్రఖని హీరోగా ‘నాన్ కడవుల్ ఇలె’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఎస్.ఏ.చంద్రశేఖర్ కథను సమకూర్చి దర్శకత్వం వహించడమే

కోలీవుడ్: విలక్షణ నటుడు సముద్రఖని హీరోగా ‘నాన్ కడవుల్ ఇలె’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఎస్.ఏ.చంద్రశేఖర్ కథను సమకూర్చి దర్శకత్వం వహించడమే కాకుండా న్యాయవాదిగా నటిస్తున్నారు. ఇందులో సముద్రఖనికి జోడీగా ఇనియాను ఎంపికచేశారు. ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాక్షి అగర్వాల్ నటిస్తుండగా, ప్రతి నాయకుడిగా ‘పరుత్తివీరన్’ శరవణన్ నటిస్తున్నారు. వీరితో పాటు రోహిణి, యువన్ మైయిల్‌స్వామి, అభి శరవణన్, ప్రియాంకా, మాయక్క, డయానాశ్రీ, మురుగానందం, ఇమాన్ అన్నాచ్చి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తాను గతంలో చిన్నారులను కథాంశంగా చేసుకుని ఓ షార్ట్‌ఫిల్మ్ తీశానని దీన్ని చూసిన సముద్రఖని ఫోన్ చేసి ఈ షార్ట్‌ఫిల్మ్‌ను సినిమాగా తెరకెక్కిస్తే తాను హీరోగా నటిస్తానని చెప్పారని, ఆ కారణంగానే ఈ చిత్రం తెరకెక్కనుందని వివరించారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన తెలిపారు.