సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సంపూర్ణేష్‌ బాబు పెద్ద మనసు!

ABN, First Publish Date - 2021-07-01T22:29:29+05:30

హీరో సంపూర్ణేష్‌ బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారిని చదివించేందుకు ముందుకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరో సంపూర్ణేష్‌ బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారిని చదివించేందుకు ముందుకొచ్చారు. చిన్న సినిమాలు చేసే హీరో అయినప్పటికీ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తనకు తోచిన సాయం చేస్తుంటారు సంపూ. తాజాగా దుబ్బాకకు చెందిన నరసింహచారి దంపతులు అప్పు బాధలతో  ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరూ కూమార్తెలు దిక్కులేని వారిగా మారారు. ఈ వార్త చూసి సంపూర్ణేష్‌ చలించిపోయారు. తక్షణమే వారి వివరాలు తెలుసుకుని రూ. 25 వేలు ఆర్థిక సాయం అందించారు.  ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తెలిపారు. ‘దుబ్బాకలో నరసింహాచారి దంపతుల ఆత్మహత్య వార్త విని నా హృదయం కలిచివేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బిడ్డలకు నేనై, సాయి రాజేశ్‌ రూ. 25వే? ఆర్థిక సాయం అందించాం. వారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను కూడా మేమే చూసుకుంటామని వారికి మాట ఇచ్చాం’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం సంపూ.. ‘బజారు రౌడీ, ‘క్యాలీఫ్లవర్‌’, ‘పుడింగి నంబర్‌ వన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. 


Updated Date - 2021-07-01T22:29:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!