ఒకే పాత్ర.. ఒకే లొకేషన్‌

ABN , First Publish Date - 2021-11-09T06:59:05+05:30 IST

బండ్ల గణేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘డేగల బాబ్జీ’. వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహించారు. స్వాతి చంద్ర నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది...

ఒకే పాత్ర.. ఒకే లొకేషన్‌

బండ్ల గణేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘డేగల బాబ్జీ’. వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహించారు. స్వాతి చంద్ర నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. సోమవారం పూరీ జగన్నాథ్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒకే పాత్రతో, ఒకే లొకేషన్‌లో తెరకెక్కించిన చిత్రమిది. మిగిలిన పాత్రల గొంతులు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. ఓ రకంగా ఇదో ప్రయోగం. డేగల బాబ్జీగా గణేష్‌ నటన ఆకట్టుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు.


Updated Date - 2021-11-09T06:59:05+05:30 IST