సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సమంత: నాలో కొత్తదనం మీకు తెలీదు

ABN, First Publish Date - 2021-12-05T01:45:18+05:30

నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత సోషల్‌ మీడియాలో స్ఫూర్తి నింపే, ప్రభావితం చేసే విషయాలను షేర్‌ చేస్తోంది. ‘అమ్మ చెప్పింది’ శీర్షికతో కౌంటర్లు ఇస్తుంది. విడాకుల విషయంలో విమర్శించిన వారికి సున్నితంగానే సమాధానం చెబుతోంది. తనను నిందించిన వారిని నాగరికతతో వ్యవహరించమని హితవు పలికింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత సోషల్‌ మీడియాలో స్ఫూర్తి నింపే, ప్రభావితం చేసే విషయాలను షేర్‌ చేస్తోంది. ‘అమ్మ చెప్పింది’ శీర్షికతో కౌంటర్లు ఇస్తుంది. విడాకుల విషయంలో విమర్శించిన వారికి సున్నితంగానే సమాధానం చెబుతోంది. తనను నిందించిన వారిని నాగరికతతో వ్యవహరించమని హితవు పలికింది. అయితే ఎవరెన్ని అన్నా నాగ చైతన్య, సమంతా మాత్రం ఈ సమస్యపై గౌరవప్రదంగా మౌనం వహించారు. తాజాగా సామ్‌ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తన తల్లితో సంభాషణల స్ర్కీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. ‘‘నాలోని కొత్తదనం నీకు తెలీదు. నా జీవితాన్ని తిరిగి కొత్తగా పేర్చుకుంటా’’ అని సమంత తన తల్లికి పంపిన సందేశాన్ని బయట పెట్టింది. దేవుడి ఆశీసులు నీకు ఉంటాయి తల్లీ అని సామ్‌ తల్లి పేర్కొంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది ఈ మెసేజ్‌. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా హాలీవుడ్‌లోనూ ఓ సినిమా అంగీకరించింది ఈ చైన్నై బ్యూటీ. 


Updated Date - 2021-12-05T01:45:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!