సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కుంగిపోయి.. చనిపోతానేమో అనుకున్నా: సమంత

ABN, First Publish Date - 2021-12-07T20:38:52+05:30

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత, నాగచైతన్యతో విడిపోయి రెండు నెలలు పూర్తయినా ఆ విషయంపై ఎక్కడా నోరు మెదపలేదు. విడాకులు ప్రకటించిన తర్వాత కొద్దిరోజులపాటు స్నేహితులతో కలిసి విహారానికి వెళ్లారు. సోషల్‌ మీడియా వేదికగా జీవిత సత్యాలను చెబుతూ. పలు మోటివేషనల్‌ కొటేషన్స్‌ పోస్ట్‌ చేస్తూ ఉంది. మరోవైపు కెరీర్‌ పరంగా బిజీగా గడుపుతోంది. అయితే సోషల్‌ మీడియాలో కూడా తన విడాకులకు సంబంధించి ఏ రోజున మాట్లాడలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత, నాగచైతన్యతో విడిపోయి రెండు నెలలు పూర్తయినా ఆ విషయంపై ఎక్కడా నోరు మెదపలేదు. విడాకులు ప్రకటించిన తర్వాత కొద్దిరోజులపాటు స్నేహితులతో కలిసి విహారానికి వెళ్లారు. సోషల్‌ మీడియా వేదికగా జీవిత సత్యాలను చెబుతూ. పలు మోటివేషనల్‌ కొటేషన్స్‌ పోస్ట్‌ చేస్తూ ఉంది. మరోవైపు కెరీర్‌ పరంగా బిజీగా గడుపుతోంది. అయితే సోషల్‌ మీడియాలో కూడా తన విడాకులకు సంబంధించి ఏ రోజున మాట్లాడలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారి సమంత విడాకులపై స్పందించారు. ‘‘మన రోజు బాగోలేకపోయినా ఫర్వాలేదు, కానీ ఈ సమయంలో మనం గళం విప్పాలి. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. జరిగిన దానిని అంగీకరిస్తే.. సగం పని పూర్తయినట్లే.  అలా అంగీకరించడం ఇష్టంలేనప్పుడు ప్రతిరోజు అంతం లేని పోరాటం మన కళ్ల ముందు ఉంటుంది. నా సమస్య ఇది.. నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటే తప్పకుండా మార్గం కనిపిస్తుంది. ఒక్క సారి ఆలోచిస్తే.. నా లైఫ్‌ నా కళ్ల ముందు కనిపించింది. ఇప్పుడు నా జీవితాన్ని నేను అనుభవించగలను. వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్యలతో  నేను ఎంత బలంగా ఉన్నానో నాకు తెలిసింది. నేను చాలా బలహీనురాలినని నా భావన. విడాకుల తర్వా కుంగిపోయి చనిపోతానేమో అనుకున్నా. కానీ అలా జరగలేదు. నేను ఎంత బలవంతురాలినో తెలిసి ఆశ్చర్యపోయా. నేను ఇంత దృఢంగా ఉంటానని అనుకోలేదు. నన్ను చూస్తే నాకే గర్వంగా ఉంది’’ అని సమంత చెప్పుకొచ్చారు. 





Updated Date - 2021-12-07T20:38:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!