Pushpa the rise : సమంత స్పెషల్ సాంగ్ షూట్ మొదలైంది!

ABN , First Publish Date - 2021-11-29T16:20:42+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్, 4 సింగిల్స్ అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. ఈ క్రమంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Pushpa the rise : సమంత స్పెషల్ సాంగ్ షూట్ మొదలైంది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప:  ది రైజ్’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్, 4 సింగిల్స్ అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. ఈ క్రమంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇంకా ట్రైలర్, ఒక సింగిల్ విడుదల కాబోతున్నాయి. కాగా ఈ సింగిల్ ను అందాల సమంత పై ప్రత్యేకంగా చిత్రీకరించబోతున్నారు. త్వరలోనే ఈ సింగిల్ విడుదల కాబోతోంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన షూట్.. నేడు (సోమవారం) ప్రారంభమైంది.


హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. గణేశ్ ఆచార్య కొరియో గ్రఫీలో బన్నీ, సామ్ నర్తిస్తోన్న ఈ పాట ఈ సినిమాకే హైలైట్ కానుందని సమాచారం. దీనికోసం రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒక అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారట. సుకుమార్, దేవీశ్రీ కలయికలో గతంలో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్సే. ఈ పాట అంతకు మించి అనే స్థాయిలో ఉండబోతోందట. ఈ పాట కోసం సామ్ .. భారీ ఎత్తున పారితోషికం అందుకుందట. అతి త్వరలోనే విడుదల కానున్న ఈ పాట లిరికల్ సాంగ్ ఏ రేంజ్ లో అభిమానుల్ని అలరిస్తుందో చూడాలి.  

Updated Date - 2021-11-29T16:20:42+05:30 IST