రొమాంటిక్ ఫొటో షేర్ చేసిన సమంత!

ABN , First Publish Date - 2021-01-01T21:31:53+05:30 IST

అక్కినేని కపుల్ నాగచైతన్య, సమంత ప్రస్తుతం గోవాలో సందడి చేస్తున్నారు.

రొమాంటిక్ ఫొటో షేర్ చేసిన సమంత!

అక్కినేని కపుల్ నాగచైతన్య, సమంత ప్రస్తుతం గోవాలో సందడి చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీరిద్దరూ స్నేహితులతో కలిసి రెండ్రోజుల ముందే గోవా వెళ్లిపోయారు. అక్కడి ఫొటోలను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. 


తాజాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సమంత ఓ రొమాంటిక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నాగచైతన్యకు ముద్దు పెడుతూ తీయించుకున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోను నాగచైతన్య కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. `రొమాంటిక్ కపుల్` అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫొటో కేవలం మూడు గంటల్లోనే లక్షకు పైగా లైకులు సాధించింది. 



Updated Date - 2021-01-01T21:31:53+05:30 IST