సమంత పాన్ ఇండియా ప్లాన్!

ABN , First Publish Date - 2021-10-18T20:38:19+05:30 IST

అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఇటీవల విడిపోతున్నట్టు ప్రకటించి. అభిమానులకి షాకిచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి బ్రే‌క్‌అప్ పై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో హీరోయిన్ గా సమంత కెరీర్ ఔట్ అనే వార్తలూ వినిపించాయి. అందుకే ఇప్పుడు సామ్ కోలీవుడ్, బాలీవుడ్ పై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం.

సమంత పాన్ ఇండియా ప్లాన్!

అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఇటీవల విడిపోతున్నట్టు ప్రకటించి. అభిమానులకి షాకిచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి బ్రే‌క్‌అప్ పై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో హీరోయిన్ గా సమంత కెరీర్ ఔట్ అనే వార్తలూ వినిపించాయి. అందుకే ఇప్పుడు సామ్ కోలీవుడ్, బాలీవుడ్ పై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం. అంతేకాదు పాన్ ఇండియా కాన్సెప్ట్స్ మాత్రమే టేకప్ చేయాలని సామ్ భావిస్తున్నారట. రీసెంట్ గా సమంత ఒక తమిళ సినిమా, శ్రీదేవి మూవీస్ సినిమాలకు సైన్ చేశారు.  వాటికి కొన్ని షరతులు విధించారట.ఒక వేళ తెలుగు ఇండస్ట్రీలో తన కెరీర్ అటూ, ఇటూ అయితే.. తమిళ, తెలుగు సినిమాల్లో నటించాలని ఆమె ప్లాన్ గా తెలుస్తోంది. వాటికోసం పాన్ ఇండియా స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. 



ఒక వైపు సినిమాల్లో నటిస్తునే, మరో వైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ.. తన ఇమేజ్ ను పాన్ ఇండియా లెవెల్లో విస్తరించాలన్నదే సామ్ ప్రయత్నం. దానికోసమే ఆమె తమిళ, హిందీ చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నారని టాక్. ఆమె బ్రేక్ అప్ ఇష్యూ కారణంగా తెలుగుతెరపై ఆమె కొంతకాలం కనిపించకపోవచ్చు. దానికి ఆల్టర్నేట్ గా కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీస్ పై కాన్సన్ ట్రేట్ చేస్తున్నట్టు సమాచారం. మరి సామ్ పాన్ ఇండియా ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.  

Updated Date - 2021-10-18T20:38:19+05:30 IST