‘శాకుంతలం’ లో సామ్ లుక్ అద్భుతమట

ABN , First Publish Date - 2021-12-29T18:22:13+05:30 IST

అందాల సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న మైథలాజికల్ మూవీ ‘శాకుంతలం’. మహాభారతం ఆదిపర్వంలోని అపూర్వమైన ఘట్టం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మేనక, విశ్వామిత్రుల అపురూప సంగమానికి గుర్తుగా జన్మించిన పసికూన కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగి పెద్దదవుతుంది. శాకుంతలం పక్షులు పెంచాయి కాబట్టి.. ఆమెకి శకుంతల అనే పేరు పెట్టి ఆమెను అపురూపంగా పెంచుతాడు కణ్వుడు. యుక్త వయసు వచ్చాకా.. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన దుష్యంత మహారాజు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరి మధ్య ఎడబాటు ఏర్పడుతుంది. చివరికి దుష్యంతుడు శకుంతలను తిరిగి ఏలుకోవడమే ఈ సినిమా ప్రధాన కథాంశం.

‘శాకుంతలం’ లో సామ్ లుక్ అద్భుతమట

అందాల సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న మైథలాజికల్ మూవీ ‘శాకుంతలం’. మహాభారతం ఆదిపర్వంలోని అపూర్వమైన ఘట్టం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మేనక, విశ్వామిత్రుల అపురూప సంగమానికి గుర్తుగా జన్మించిన పసికూన కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగి పెద్దదవుతుంది. శాకుంతలం పక్షులు పెంచాయి కాబట్టి.. ఆమెకి శకుంతల అనే పేరు పెట్టి ఆమెను అపురూపంగా పెంచుతాడు కణ్వుడు. యుక్త వయసు వచ్చాకా.. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన దుష్యంత మహారాజు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరి మధ్య ఎడబాటు ఏర్పడుతుంది. చివరికి దుష్యంతుడు శకుంతలను తిరిగి ఏలుకోవడమే ఈ సినిమా ప్రధాన కథాంశం. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తుండగా.. కణ్వుడిగా మోహన్ బాబు నటిస్తున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇంకా  భరతుడి పాత్రలో అల్లు అర్జున్ గారాల కూతురు అర్హ నటించింది. కరోనా పాండమిక్ సిట్యువేషన్స్ లో మొదలు పెట్టిన ఈ సినిమాను తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేశారు గుణశేఖర్. కానీ ఇంతవరకూ ఈ సినిమాకు సంబంధించిన ఒక లుక్ ను కూడా విడుదల చేయలేదు. 


అయితే ఈ సినిమాలోని సమంత లుక్ అద్భుతమని చెబుతోంది. మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్. శకుంతలగా ముగ్ధమోనరూపంలోని సమంత లుక్ ప్రతి ఒక్కరినీ మేస్మరైజ్ చేస్తుందట. ఆ పాత్రలో ఆమె అభినయం అపూర్వమని చెబుతోంది. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారంటోంది. ఈ విషయాన్ని నీలిమా గుణ తన ట్విట్టర్ హ్వాండిల్ ద్వారా తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ కుమార్తె నీలిమా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది విడదల కానున్న ఈ సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. మరి శకుంతలగా సామ్ ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటుందో చూడాలి. Updated Date - 2021-12-29T18:22:13+05:30 IST